ఇప్పటికే హారిక తనకు చెల్లెలు లాంటిదని కన్ఫర్మ్ చేసిన అభిజీత్ తాజాగా మరోసారి అదే మాట చెప్పాడు. ఇక మోనాల్ గజ్జర్‌తో కలవడానికి కారణం.. బిగ్ బాస్ స్టేజ్‌పై జరిగిన ఫన్నీ గేమే అని అన్నాడు. ''ఆరోజు స్టేజ్ మీద గేమ్ ఆడాక.. లోపలికి వెళ్లి మోనాల్‌ను ఎప్పుడు కలుస్తానా అనుకున్నా. ఆమెతో చాలా రోజులు ట్రావెల్ చేయాలని భావించా. అందుకే తన గురించి తెలుసుకోడానికి ట్రై చేశా. అంతేగానీ ట్రాకులు నడపడం లాంటివి ఏమీ లేవు'' అన్నాడు అభిజీత్.