తాజాగా రిలీజ్ చేసిన  ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోమోలో స్కిట్లను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరెలా ప్రవర్తిస్తుంటారో అనే అంశాలను ఎడిట్ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ పర్సనల్ వీడియోను కూడా ప్లే చేయడం జరిగింది. ముందుగా సుధీర్ రొమాంటిక్గా రష్మీకి పూలతో విష్ చేశాడు. ఆ తర్వాత హగ్ చేసుకోమని అడగడం, దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోవడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది.