చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంటే, ఆ సెట్‌కు మోహన్‌బాబు స్వయంగా వెళ్లి చిరంజీవిని స్నేహపూర్వకంగా కలిశారు.చిరకాల మిత్రుడు తన సెట్‌కు రావడంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడుకొన్నారు. అంతకు ముందే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరుని కల్సి, ఎందుకు కలిసానో తర్వాత చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టాడు.