తన శిష్యుడు వెంకీ కుడుముల కోసం ఓ కథ సిద్ధం చేశాడట త్రివిక్రమ్.త్రివిక్రమ్ మూవీ 'ఆ.. ఆ'కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా వచ్చిన 'చలో' మూవీతో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు తన మూడో చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ తో ప్లాన్ చేశాడట వెంకీ.  ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ సిద్ధం చేశాడని టాక్.