విజయ్ దేవరకొండ కసరత్తులు చేస్తున్న వీడియోను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ..దటీజ్ మై హీరో, దటీజ్ మై ఫైటర్..నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్. లవ్ యూ విజయ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.వీరిద్దరూ అంటే మాస్ కు పెట్టింది పేరు. జనాలు కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే క్రేజ్ మాములుగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. విజయ్-పూరీ మళ్లీ షూటింగ్ తో బిజీ అయిపోయినట్టు తాజా వీడియో చూస్తే అర్థమవుతుంది