డైరెక్టర్ మారుతి ఓ ప్రముఖ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు." మా ఊరు మచిలీపట్నంలో స్టిక్కరింగ్ ఆర్ట్స్ పనులు చేస్తూ ఉండేవాడిని. యానిమేషన్ వర్క్స్ నేర్చుకున్నాను. అదే అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంలో నేను చేసిన లోగో, పార్టీ జెండా తయారీ పనుల సమయంలో చిరంజీవితో పరిచయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.  ఆయన స్ఫూర్తితోనే అడుగులు వేశాను.