బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు కంగనా గురించి మాట్లాడుతూ ‘‘మేమిద్దరం పెద్దగా కలుసుకోం. ఎప్పుడైనా కలిస్తే సరదాగా మాట్లాడుతుంది. అయితే పర్సనల్‌గా నాకు తెలిసిన కంగన… ఇప్పుడు చూస్తున్న కంగన ఒకటి కాదు. ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. చేసే పనిలో, మాటలో కొత్తగా ఉంటోంది. నాకు తెలిసి ఇద్దరు కంగనా రనౌత్‌లు ఉన్నట్లున్నారు. అందులో ఒకరి గురించి మాత్రమే నాకు తెలుసు. ఆ రెండో కంగనా రనౌత్ నాకు అస్సలు అర్థం కావడం లేదు’’ అంటూ కామెంట్స్ చేశాడు.