మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుధీర్ తన మూవీ షూటింగ్లో పాల్గొన్నారు.  స్థానికులు షూటింగ్ ప్రదేశానికి చేరుకుని దానిని అడ్డుకున్నారు. కరోనా ఉద్ధృతి నేపధ్యంలో నివాసాల మధ్య షూటింగ్లు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.