ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ వచ్చిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం ఉదయం మెగా పవర్ స్టార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తనను కలిసినవారంతా తక్షణమే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా కోలుకోని మళ్లీ ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్ చెప్పాడు.అయితే, రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే మెగా అభిమానులు కంగారు పడ్డారు. దీనికి తోడు రామ్ చరణ్ సోదరుడు వరుణ్ తేజ్‌కు కూడా పాజిటివ్ రావడం మరింత కంగారు పెట్టింది. అయితే, భయపడాల్సిన అవసరం లేదని వీరిద్దరూ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటారని మెగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో స్పందించింది.  ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.‘‘ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతోంది. 2021 అయినా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా దృఢంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, నాకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను మిస్టర్ సి హోం క్వారంటైన్లో ఉన్నాను. వేడి ద్రావణాలు తీసుకుంటున్నాం. ఆవిరి పడుతున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని ఉపాసన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పటం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...