అనతికాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలన సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్న థమన్.. వరుసగా బడా హీరోల చిత్రాలకు సంగీతం అందించాడు.ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొత్తం థమన్ హవా కొనసాగనుంది. ఇప్పటికే గడిచిన ఏడాదిలో ‘అల వైకుంఠ పురములో’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న థమన్ కొత్తేడాది కూడా ఫుల్ బిజీగా మారనున్నాడు.