వాస్తవానికి రజనీకాంత్ పార్టీ పెట్టే విషయంలో అనారోగ్య సమస్య అనేది ప్రధాన కారణం కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పెడతానన్న ఆలోచన రెండున్నర దశాబ్దాలుగా ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అలాంటప్పుడు అనారోగ్యం అనే కారణం కరెక్ట్ కాకపోవచ్చునని కూడా అభిప్రాయపడుతున్నారు.