RRR సినిమా నుండి రాజమౌళి.. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఒక మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయిస్తున్నాడట. మరోసారి ఇద్దరు హీరోల లుక్స్ తో ఒకే పోస్టర్ లో ఇద్దరిని చూపించే విధంగా ఉంటుందట.  ఇద్దరిని ఈసారి మరింత విభిన్నంగా చూపించడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.