తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ. అయితే మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా 'క్రాక్' ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.