చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక మూవీతో తన ఇమేజ్, రేంజ్ మరింత పెరుగుతుందని చెర్రీ భావిస్తున్నాడు.