తన తండ్రి యాక్టింగ్ గురించి చెప్పరని, యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరని.. కానీ తను మాత్రం పెద్దయిన తరువాత సినీ తారను కావాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది సితార. తన సోదరుడు గౌతమ్ తో కలిసి నటించాలనుందని.. కానీ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదని అంది. ఆ అవకాశం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. గౌతమ్ ఇప్పటికే నాన్నతో కలిసి నటించాడని.. తనకు కూడా నాన్నతో కలిసి నటించాలనుందని తన కోరిక బయటపెట్టింది సితార.