తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమెడియన్ కమ్, పొలిటికల్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వి రాజ్. మూడేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా.. పొలిటికల్‌గా మూడు చోట్ల కూడా ఈయన దెబ్బ తింటున్నాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే సినిమాలు రావడం లేదు.. మరోవైపు రాజకీయాల్లో కూడా ఉన్న పదవి కాస్తా ఊడిపోయింది.