తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమా రిలీజ్ కాకముందే భారీగా క్రెజ్ ని సంపాదించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ కి వరసగా టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయని చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.