‘అసలు ఇక్కడే ఇంకా ఏమీ సాధించలేదు.. బాలీవుడ్ వెళ్తే ఏం సాధిస్తాను’ అంటూ ప్రభాస్ ఆ టైములో సమాధానం చెప్పాడట. అంతేకాదు బాలీవుడ్ ఎంట్రీ అంటేనే చాలా టెన్షన్ వచ్చేదని ప్రభాస్ తెలపడం గమనార్హం. అంత భయపడిన ప్రభాస్.. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలతోనే సమానంగా రాణిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పొచ్చు.