తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది..వారిద్దరూ అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని తెలుస్తోంది.. ఈ సంవత్సరమే వారిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.కోలీవుడ్ మీడియా ప్రకారం విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారట.