చిత్ర పరిశ్రమలోని సెలెబ్రెటీలు అంత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త రిజెల్యూషన్ తీసుకున్నట్టున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌ల విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. కొత్త ఏడాదిలో స్పీడు పెంచుతున్నారు. ఒక్కటి కాదు ఒకేసారి రెండు సినిమాలు అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. లాక్ డౌన్ తరువాత అందరికంటే ఆలస్యంగా సెట్‌కు వచ్చిన హీరో పవన్ కల్యాణే.