తెలుగు చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సెగ పుట్టించాలని ఫిక్సయ్యాక.. వెనక్కి తిరిగి చూసుకునేదే లేదంటుంది శృతి హాసన్. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మూడేళ్ల తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రుతిహాసన్ తనదైన శైలిలో రెచ్చిపోతుంది. రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించిన శ్రుతి వచ్చి రావడంతోనే రచ్చ చేస్తుంది.