తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు.