మాధవన్ ని ఉద్దేశిస్తూ ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో.. ”మ్యాడీకి పెద్ద అభిమానిని.కానీ అతడు తాగుడుకు బానిసై, డ్రగ్స్ కి అలవాటు పడుతూ అటు కెరీర్ ను, ఇటు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నా.. బాలీవుడ్ లో వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడు..? ఇప్పుడు ఎలా తయారయ్యాడు..? అతడి ముఖం చూస్తేనే తెలుస్తుంది” అంటూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన మాధవన్ కి కోపం వచ్చింది. వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ”ఓహో.. మీరు ఇలా పరీక్షిస్తారన్నమాట. పాపం, మీ పేషేంట్లను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాకు తెలిసి మీరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిది” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు.