రానా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్న సినిమా "అరణ్య". పండుగకి వరుసగా నాలుగు భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో థియేటర్లన్నీ ఆక్యుపై అయిన సందర్భంగా అరణ్య సినిమాను మరో రెండు నెలలకు పైగా వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాను 2021 మార్చి 26న విడుదల చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే.