ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టిన 'ఖిలాడి' టీమ్..అప్పుడే 40 శాతం చిత్రీకరణ పూర్తిచేసేసిందట. ఈ విషయాన్ని రవితేజ తాజాగా స్వయంగా చెప్పుకొచ్చాడు. వేసవి విడుదలని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం..  ఇదే స్పీడ్ తో మార్చి నాటికి గుమ్మడికొయ కొట్టేసినా ఆశ్చర్యమేమి లేదు.