తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే కామెడీ షోలు అన్నింటిలో జబర్దస్త్ టాప్. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 8 ఏళ్లుగా టెలివిజన్ రంగం లో ఎదురు లేకుండా కొనసాగుతున్న ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఎప్పటికప్పుడు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ సరికొత్త కంటెంట్ తో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటుంది.