తమిళ హీరో ధనుష్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కాంబినేషనల్లో ఓ సినిమా తీయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోను ఆ చిత్ర దర్శకుడు తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో “తిరిగి నా ప్రపంచానికి వచ్చాను” అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ చిత్రానికి ఎస్12గా టైటిల్ ఖరారు చేసినట్లుగా కనిపిస్తోంది.