అంతకుముందు వరకు ఏ సినిమాలో కూడా నటించని రామ్ సడన్ గా అవకాశం ఎలా అందుకున్నాడు అనే విషయంలోకి వెళితే.. అతను యష్ పర్సనల్ బాడీగార్డ్ కావడం వలనే సినిమాలో మెయిన్ విలన్ అయ్యాడట. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ కు కథ చెప్పినప్పుడే రామ్ ను చూసి ఆడిషన్స్ కు రమ్మని పిలిచాడట. ఎప్పటి నుంచో యష్ కూడా అతన్ని సినిమాల్లో విలన్ పాత్రలో చూడాలని అనుకుంటున్నాడు.