ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ గురించి తెలియని వారుండరూ. ‘ది కపిల్ శర్మ షో’లో యాంకర్ గా హోస్ట్ చేస్తూ ప్రేక్షకుల ప్రేమ, ఆదరణను పెంపొందించుకున్నారు. సినిమా హీరో, హీరోయిన్లతో ఇంటర్యూలు చేస్తూ.. కామెడీ కన్వర్జెషన్ మధ్య సాగే ఈ షోకు ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది.