తెలుగు చిత్ర పరిశ్రమలో పౌరాణిక కథాంశంతో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించబోయే సినిమా ‘శాకుంతలం’. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా హీరోయిన్ ఎవరనేదానిపై అనేక వార్తలు వచ్చాయి. ఇందులో ముందుగా పూజా హెగ్డే నటింనున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు గుణశేఖర్.