కరోనా సమయంలో అందరికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వెండితెరపై విలన్ గా నటించిన ఆయన రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్లో ఎంతోమందికి ఆశ్రయం కల్పించి దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సోనూ సూద్ పై కేసు నమోదు అయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ పై లీగల్ కేసు పెట్టింది.