ట్విట్టర్ లో ప్రణీత ఈ విధంగా మాట్లాడుతూ.. దశాబ్దాల హిందువుల కలను సాకారం చేస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలైన విషయం తెలిసిందే. నేపథ్యంలోనే దేవాలయ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ‘రామమందిర్ నిధి’ పేరుతో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ వంతుగా విరాళాలను అందజేస్తున్నారు. దీనిలో తాను కూడా పాలు పంచుకున్నానని, రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందజేసినట్లు ట్విట్టర్ వేదికగా ఆమె చెప్పుకొచ్చారు.