టాలీవుడ్ లో నాని హీరోగా “అలా మొదలైంది” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా నిత్యామీనన్ ఆ సినిమా విజయంతో తర్వాత వచ్చిన "ఇష్క్ "," గుండెజారి గల్లంతయ్యిందే " సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో తెలుగు హీరోయిన్ గా స్టార్ట్ హోదా లభించింది. మలయాళం నటి అయినప్పటికీ, నిత్యా తెలుగు అమ్మాయి పాత్రలో అచ్చం గా ఇమిడిపోతుంది. నిత్య మీనన్ కూడా బాలనటిగా “ద మనీ హు నో టూ మచ్ ” అనే సినిమాలో నటించి మెప్పించింది.