తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది.