ఇప్పుడు అఖిల్ తాజాగా మరో సినిమాకి పచ్చ జెండా ఊపాడట. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ ఎన్ డీకేలతో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడట. అంతేకాకుండా పాన్ ఇండియా రేసులోకి అడుగుపెట్టేందుకు కూడా అఖిల్ అన్ని విధాల సన్నద్దం అవుతున్నాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.