కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలకు వారి సొంత ఊళ్లకు పంపడానికి బస్సులను ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు ఉపాధి చూపడానికి ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్ సైట్ ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు ఇలా రైతులకు విద్యార్థులకు యువతకు ఎందరికో సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.