తెలుగు చిత్ర పరిశ్రమలో తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాలను చేస్తూ హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి అన్ని తరహా పాత్రల్లో నటిస్తుంది.