తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో తన టాలెంట్ కూడా చూపించాడు పవన్. అంతేకాదు.. తన మార్షల్ ఆర్ట్స్ కారణంతోనే సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయేలా కంపోజ్ చేసేవాడు.