తమన్ ఎన్ని హిట్లు అందుకున్నా.. ఈ కాపీ ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. గతంలో కొన్ని సార్లు ఈ ఇష్యూపై స్పందించిన తమన్ తాజాగా మరోసారి తన వెర్షన్ వినిపించాడు. కాపీ విమర్శలను పట్టించుకోనని చెప్పిన తమన్.. ఇండస్ట్రీలో తను పెద్ద హీరోలతో, దర్శకులతో, నిర్మాతలతో, రచయితలతో కలిసి పని చేశానని.. కాపీ ట్యూన్లు అయితే వారు గుర్తు పట్టి ప్రశ్నించరా..? అని అడిగాడు తమన్.