తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ..'క్రాక్' సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు..  జనవరి 9న రిలీజ్ చేసాం కానీ నాకు పెద్ద షాక్ తగిలింది. ఉదయం 8.45కి షో పడలేదు.. 11గంటలకు పడలేదు.. మాట్నీ కూడా పడలేదు. ఫస్ట్‌షో కూడా పడలేదు. ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది అనిపించింది. దాన్ని మాటల్లో చెప్పలేను. చివరకు సెకండ్ షో పడింది. అప్పటికి జనాలు వస్తారని అనుకోలేదు.