సినీ నటుడు నరేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద్భంగా మాట్లాడుతూ.. కళాకారుడికి అలసట అనేది ఉండదు. అందరికీ వినోదం పంచడమే మా పని . మా ముందు ఉన్నది మాత్రం ఒకటే లక్ష్యం ప్రేక్షకులను అలరించడం. దాదాపుగా 49 యేళ్లుగా కొనసాగుతున్న ఈ నట ప్రయాణం ఎప్పటికీ మరువలేనిది'' అన్నారు ప్రముఖ నటుడు నరేష్ వీకే.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు.