ఆరనీకుమా ఈ దీపం..కార్తీక దీపం’.. తెలుగు డీజే పాటలలో ఇది చాలా ఫేమస్. కాని ఈ పాట వింటే మనకు గుర్తొచ్చేది మాత్రం వంటలక్క పాత్రలో ఉన్న దీప మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ దీప గురించి తెలియని వారంటూ లేరు. ఇక బుల్లితెర లేడి సూపర్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.