ప్రదీప్ మాచిరాజు. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అంటూ సోలో ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన ప్రదీప్.. ఆ మధ్య స్వయం వరం ప్రోగ్రామ్ తో కోరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఆ స్వయంవరం కాస్తా వికటించడంతో ప్రదీప్ బాగానే ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఓసారి డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇప్పుడు లిప్ లాక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ గా మారాడు ప్రదీప్.