తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇక నితిన్ ‘భీష్మ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. ఒక్క సినిమాతో అన్నీ ఓవర్ కమ్ చేసాడు ఈ యంగ్ హీరో. వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా గతేడాది లాక్ డౌన్ కు సరిగ్గా 15 రోజుల ముందు విడుదలైంది. ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ పూర్తయింది.