బుల్లితెరపై బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది ఫేమస్ అయిపోయారు. ఫైనలిస్టులుగా నిలిచిన వారితో పాటు మిగిలిన వారికి కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. ఇక వీరందరిలో అమ్మాయిల ఫాలోయింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అరియానా గ్లోరి. ఇంటి నుండి బయటకు వచ్చాక వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా ఒక టాలీవుడ్ యంగ్ హీరో తో కలిసి రచ్చ చేసింది.