గత కొద్దీ సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమైయ్యే జబర్డస్త్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ షోకి జడ్జిగా రోజా, మను ఉన్నారు. ఇక రోజా సెల్వమణి.. ఇటు జబర్దస్త్, అటు రాజకీయాలోను రాణిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినా జబర్దస్త్‌ను మాత్రం వీడలేదు రోజా. జడ్జిగానే కాదు.. తనదైన పంచ్‌లతో కమెడియన్లపై సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజా జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు.