తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగశౌర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఛలో, ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల హీరోయిన్ అక్కినేని సమంత నటించిన ఓ బేబి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో.