‘‘స్వరూపక్క పాత్రకు… నిజజీవితంలో నా శైలికి ఎక్కడా పొంతన ఉండదు. కానీ పాత్రను జాగ్రత్తగా గమనించి… అందుకు తగ్గట్టుగా నటించాను. తెర మీద చూసేవారికి, నా సన్నిహితులకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. నటిగా మనల్ని సవాలు చేసే పాత్రలు చేయాలని అందరూ కోరుకుంటారు. నాకు ఈ సినిమాతో అలాంటి అవకాశం దక్కింది’’ అని చెప్పింది మంచు లక్ష్మి.