తెలుగు చిత్ర పరిశ్రమలో రాధికా ఆప్టే గురించి తెలియని వారంటూ ఉండరు. లెజెండ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఒక్క ఇండస్ట్రీకి పరిమితం కాకుండా తెలుగు నుంచి మొదలు పెట్టి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా తన ప్రత్యేకత చూపిస్తుంది రాధిక. ఇక తెలుగులోనూ లెజెండ్, ధోనీ, లయన్ లాంటి సినిమాలు చేసింది ఆప్టే. ఆ తర్వాత దక్షిణాదిన హీరోయిన్లకు అస్సలు విలువ ఇవ్వరంటూ సంచలన వ్యాఖ్యలు చేసి బాలీవుడ్ వెళ్ళిపోయింది.