తెలుగు సినిమాల్లో అమ్మగా, అత్తగా, అక్కగా ఎన్నో పాత్రలు పోషించిన పగ్రతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చీర కడితే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ప్రగతి సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా కనిపిస్తూ వార్తలో నిలుస్తున్నారు. ఇక అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ప్రగతికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. వెంట వెంటనే షూటింగ్లతో ఫుల్ బిజీగా అయిపోయింది. సినీ అవకాశాలే కాకుండా ప్రకటనలతోనూ బాగానే సంపాదించడం మొదలు పెట్టేసింది.